:

2 Timothy 2

1

"నా కుమారుడా, క్రీస్తుయేసు నందున్న కృపచేత బలవంతుడవుకమ్ము."

2

నీవు అనేక సాక్షుల యెదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము.

3

క్రీస్తుయేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడ శ్రమను అనుభవించుము.

4

సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్ట వలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.

5

"మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు."

6

పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలుపుచ్చుకొనవలసిన వాడు.

7

నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము; అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును.

8

నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము.

9

"నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్ళతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు."

10

అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.

11

"ఈ మాట నమ్మదగినది, ఏదనగా - మన మాయనతో కూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రతుకుదుము."

12

సహించినవారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను యెరుగమనిన యెడల ఆయన మనలను యెరుగననును.

13

"మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా నేమియు చేయలేడు, ఆయన తన్ను తానెరగననలేడు."

14

"వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు యెదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము."

15

దేవుని యెదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పని వానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుబరచుకొనుటకు జాగ్రత్త పడుము.

16

అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు.

17

"కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనైయును, ఫిలేతును ఉన్నారు;"

18

వారు-పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపొయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.

19

"అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది.- నిలకడగా ఉన్నది, ప్రభువు తనవారిని ఎరుగును అన్నదియు, ప్రభువునామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అన్నదియు దానికి ముద్రగానున్నది."

20

". గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కర్రవియును మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును."

21

". ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధ పరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును."

22

నీవు యౌవనేచ్ఛల నుండి వాటిని విడిచి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.

23

నేర్పు లేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించునని యెరిగి అట్టి వాటిని విసర్జించుము.

24

"సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై దేవుడొక వేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును.,"

25

"అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో నని, ప్రభువు యొక్క దాసుడు"

26

"అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్ధు గాను కీడును సహించువాడు గాను ఉండవలెను."

Link: